Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహాదేవపూర్
మండల కేంద్రంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో బల్లి సురేందర్ కళాబందం కరోనా టీకాలపై కళాజాత ప్రదర్శన నిర్వహించింది. బృందం ఆలపించిన ప్రజా చైతన్య గీతాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. సమాజంలోని దూరాచారాలు, వ్యసనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అర్హులందరూ టీకా వేసుకోవాలని, కోవిడ్-19 నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీపతి బాపు మాట్లాడారు. కరోనా నివారణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతి పారిశుధ్య స్థాయి సంఘం కన్వీనర్ లింగాల రామయ్య, సీనియర్ నాయకులు పెండ్యాల సునీల్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ వెన్నంపల్లి మహేష్, నాయకులు మెరుగు లక్ష్మణ్, చిలుక రమేష్, చింతకుంట్ల సతీష్, దీకొండ మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.