Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కేసముద్రం రూరల్
రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు గునిగంటి రాజన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని హరిహర గార్డెన్లో చాగంటి కిషన్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన పార్టీ మండల కమిటీ సమావేశానికి రాజన్న ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులను ఇబ్బంది పెడితే ప్రభుత్వం కుప్పకూలుతుందని హెచ్చరించారు. రైతులు పండించిన పంటను ఐకేపీ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని, గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఈనెల 9న తలపెటిటన ఆందోళనలు విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకుడు మార్తినేని పాపారావు, మండల కార్యదర్శి మోడెం వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు జాటోత్ వెంకన్న, సావిత్రి, కావటి నర్సయ్య, కంచ శ్రీను, ఇస్లావత్ రెడ్యా, రాజు, తిరుమల్, సీఐటీయూ మండల కార్యదర్శి జయరాజు, తదితరులు పాల్గొన్నారు.