Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమ్మక్క-సారక్క ఆర్టిస్ట్స్
అసోసియేషన్ అధ్యక్షుడు నర్సింహారావు
నవతెలంగాణ-తాడ్వాయి
ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతల మహాజాతర పెయింటింగ్ పనులను ఏజెన్సీలోని స్థానిక ఆర్టిస్టులకే ఇవ్వాలని సమ్మక్క సారలమ్మ పెయింటింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మల్కం నర్సింహారావు ప్రభుత్వాన్ని, కలెక్టర్, ఇన్ఛార్జీ ఐటీడీఏ పీఓ కృష్ణ ఆదిత్యను కోరారు. మండల కేంద్రంలో చిడం బలరామ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమ్మక్క సారలమ్మ ఆర్టిస్ట్ అసోసియేషన్ అత్యవసర సమావేశానికి ముఖ్యఅతిథిగా నర్సింహారావు హాజరై మాట్లాడారు. కరోనా లాక్డౌన్ కాలం నుంచి జిల్లా ఆర్టిస్టులు పనుల్లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. డిజిటల్ ఫైన్ ప్రింటర్స్ వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ బతుకులు దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు మేడారం మహా జాతర జరగనున్న క్రమంలో అందుకు సంబంధించిన పనులను స్థానిక ఆర్టిస్టులకే ఇచ్చి ఉపాధి కల్పించాలని కోరారు. స్థానిక ఆర్టిసులకు పనులు అప్పగించేలా మంత్రి సత్యవతి రాథోడ్ చొరవ చూపాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్టిస్టులు రవి, కేశవ్, మురళీ, నరేష్, వేణుమాధవ్, తదితరులు పాల్గొన్నారు.