Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.4 లక్షలతో డైనింగ్ హాల్ షెడ్ నిర్మాణం
నవతెలంగాణ-చిట్యాల
మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్లో 1990-91లో టెన్త్ చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. వారి సాయం ద్వారా రూ.4 లక్షల వ్యయంతో నిర్మించిన డైనింగ్ హాల్‌ను జెడ్పీటీసీ గొర్రె సాగర్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నాటి ఉపాధ్యాయులను సన్మానించి సత్కరించారు. అనంతరం జెడ్పీటీసీ సాగర్ మాట్లాడారు. పూర్వ విద్యార్థులు పాఠశాల అభివృద్ధికి తోడ్పాటు అందించడం అభినందనీయమని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఇరుకులపాటి పూర్ణచందర్, ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, టౌన్ అధ్యక్షుడు బుర్ర శ్రీధర్, సీనియర్ నాయకుడు అల్లం రవీందర్, పూర్వ ఉపాధ్యాయులు రామ్మోహన్రావు, పగడాల ఐలయ్య, భిక్షపతి, జయపాల్, సోమేశ్వర్, పూర్వ విద్యార్థులు కట్కూరు మొగిలి, డాక్టర్ నవీన్, ఆకుల రవీందర్, కొండ రమేష్, బొచ్చు జితేందర్, మార్కండేయ, సామల రమేష్, సదానందం, ఆరెపెల్లి కుమార్, నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.