Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
మొగుళ్లపల్లి ఎస్సైగా బి మాధవ్ గౌడ్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసిన మహేంద్ర కుమార్ జిల్లా ఎస్పీ కార్యాలయానికి అటాచ్ కాగా ఘనపురం పోలీస్‌స్టేషన్‌లో ట్రెయినీ ఎస్సైగా కొనసాగుతున్న మాధవ్ గౌడ్‌ను ఎస్సైగా ప్రభుత్వం నియమించింది. ఈ సందర్భంగా ఎస్సై మాధవ్ మాట్లాడారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పాటు పడతామని చెప్పారు.