Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తొర్రూరు
అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో పాలకుల తప్పుడు విధానాలపై ప్రజలు ఉద్యమించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు యనమల వెంకటయ్య కోరారు. స్థానిక పార్టీ కార్యాలయంలో మండల కార్యదర్శి యాకూబ్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా వెంకటయ్య హాజరై మాట్లాడారు. రష్యాలో 104 ఏండ్ల క్రితం జార్జి చక్రవర్తి పాలనకు వ్యతిరేకంగా లెనిన్ నాయకత్వంలో కార్మికవర్గం తిరుగుబాటుతో మహత్తర పోరాటం జరిగి విముక్తి లభించిందని చెప్పారు. నాటి పోరాటం రష్యాతోపాటు అనేక దేశాలపై ప్రభావం చూపిందని తెలిపారు. ఆ క్రమంలో కమ్యూనిస్టు ప్రభుత్వాలు ఏర్పడ్డాయన్నారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అక్టోబర్ విప్లవ స్ఫూర్తితో ఐక్యపోరాటాలు నిర్మించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి జమ్ముల శ్రీను, మండల నాయకులు డోనుక దర్గయ్య, మార్క సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.