Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ జిల్లాలోని ఏజెన్సీ మండలాలకు చెందిన గిరిజనేతర రైతులు రాజకీయ పార్టీలకు అతీతంగా రైతు సేవా సంఘం పేరుతో తమకు సైతం హక్కు పత్రాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలో కదం తొక్కారు. జిల్లా నలుమూలల నుంచి భారీగా తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని నర్సంపేట బైపాస్ నుంచి కలెక్టరేట్ మూడు కోట్ల సెంటర్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా మూడు కోట్ల సెంటర్లో ర్యాలీని పోలీసులు అడ్డుకోగా స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా మూడు కోట్ల సెంటర్లో గిరిజనేతర రైతు సేవా సంఘం నాయకుడు ఎస్కే నబీ సాబ్ మాట్లాడారు. ఏజెన్సీలో గిరిజనులతోపాటు గిరిజనేతరులు సైతం అనేక తరాలుగా పోడు భూముల్లో సాగు చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటుఆ్నమని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనేతరులు 90 ఏండ్లుగా పోడు సాగులో ఉన్నట్టు ఆధారాలు చూపాలని నిర్ధేశించడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పోడు సాగులో ఉన్న గిరిజనేతరులకు సైతం హక్కు పత్రాలు ఇవ్వాలని, ఎఫ్ఆర్సీల్లో గిరిజనేతరులకు సైతం అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చల్లా నారాయణరెడ్డి, దేశెట్టి శ్రీనివాస్‌రెడ్డి, సుంకరబోయిన మొగిలి, కొమ్మనబోయిన వేణు, బిట్ల శ్రీనివాస్, గజ్జి రామన్న, కొమురెల్లి, రమేష్, సుభాష్‌రెడ్డి, కర్ర జనార్ధన్‌రెడ్డి, ముసుకు వెంకన్న, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.