Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
నవతెలంగాణ-తొర్రూరు
ప్రయివేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభు త్వం కళాశాలల్లో వసతులు కల్పిస్తామని పంచా యతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. డివిజన్ కేంద్రంలో రూ.3.90 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి మంత్రి సోమవారం ప్రారంభించి మాట్లాడారు. 2008-09లో కళాశాల ప్రారంభం కాగా విద్యార్థులు, ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ఐదేండ్లుగా సొంత భవన నిర్మాణ కోసం గేల్ సంస్థకు ప్రతిపాదనలు పంపించి నిధులు మంజూరు చేయించినట్టు తెలిపారు. గతంలో అనేక సమస్యలుండగా వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు విద్యార్థులు వినియోగించుకుని రాణించాలని ఆకాంక్షించారు. క్రీడా మైదానం అభివద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు చొరవ తీసుకుంటానని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ సాయి బాబా, మున్సిపల్ చైర్మెన్ రామచంద్రయ్య, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, ఎంపీపీ అంజయ్య, జెడ్పీటీసీ శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మెన్ కాకిరాల హరిప్రసాద్, గేల్ జోనల్ మేనేజర్ శరత్ త్రిపాఠి, సీనియర్ మేనేజర్ బాలాజీ, కుమారస్వామి, ఆర్డీఓ రమేష్ బాబు, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ నాగమణి, ఎంపీడీఓ భారతి, తదితరులు పాల్గొన్నారు.