Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్
నవతెలంగాణ-సుబేదారి
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల వేతనాలు పెంచాలని కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ శ్రీధర్ కుమార్ లోధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హన్మకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో సోమవారం నిర్వహించిన కేయూ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం జనరల్ బాడీ సమావేశానికి శ్రీధర్ హాజరై మాట్లాడారు. యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు యూజీసీ 7వ పే అమలు చేస్తూ ఏటా మూడు శాతం క్యుములేటివ్ ఇంక్రిమెంట్ ఇవ్వడంతోపాటు నెట్, సెట్ ఉండి పీహెచ్డీ పూర్తి చేసిన వారికి నెలకు రూ.5 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోసం కాంట్రాక్టు అధ్యాపకులు పోరాటాలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగయ్య, కోశాధికారి డాక్టర్ సతీష్ కుమార్, డాక్టర్ సూర్యం, డాక్టర్ సదాశివ, జై చందులాల్ తదితరులు పాల్గొన్నారు.