Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో సోమవారం టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఎనుముల రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు కేక్ కట్ చేసి శ్రేణులకు స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం వెంకన్న, రఘు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా పార్టీని బలోపేతం చేసే దిశగా రేవంత్రెడ్డి ఎనలేని కృషి చేస్తున్నాడని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వావిలాల నర్సింగరావు, చిన్నయ్య, మండల ప్రధాన కార్యదర్శి గౌస్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ముక్కెర లాలయ్య, కన్నాయిగూడెం వైస్ ఎంపీపీ బుల్లె భాస్కర్, జాడి రాంబాబు, వసంత శ్రీనివాస్, వల్స తిరుపతి, మండల ఉపాధ్యక్షుడు రియాజ్, గ్రామ కమిటీ యూత్ అధ్యక్షుడు ముస్తఫా, వార్డ్ సభ్యులు పడిదల హన్మంతు, చిక్కల్ల మానస, కట్కూరి రాధిక, సాధనపల్లి లక్ష్మయ్య, కిరణ్, సరికొప్పుల శ్రీను, నగేష్, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు.
కన్నాయిగూడెం : కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అఫ్సర్ పాషా ఆధ్వర్యంలో రేవంత్రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు అబు రమేష్, బీసీ సెల్ అధ్యక్షుడు కటకం మల్లయ్య, ఎస్సీ సెల్ అధ్యక్షుడు సునారికాని రాంబాబు, ఏటూరు ఎంపీటీసీ చిట్యాల శైలజ అరుణ్, ముప్పనపల్లి ఉపసర్పంచ్ తొంగలి రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు మంచాల సత్యం, కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు మాదాసు రాజేందర్, పాపయ్య, ఎస్సీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి అంబాల సమ్మయ్య, బొగ్గుల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.