Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేష్
నవతెలంగాణ-ములుగు
ఫారెస్ట్ రైట్స్ కమిటీ (ఎఫ్ఆర్సీ)ల్లో దళితు లకు ప్రాధాన్యత ఇవ్వాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకుడు దుర్గం నగేష్ సోమవారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ఏజెన్సీలో ఆదివాసీ గిరిజన గ్రామాలు ఏర్పడ్డప్పటి నుంచి మాల, మాదిగలు, మంగలి, చాకలి, కుమ్మరి, కమ్మరి, తదితర చేతివత్తుల ప్రజలు కలిసి జీవిస్తున్నారని పేర్కొన్నారు. ఏజెన్సీ దళితుల, గిరిజన సంస్కతి సంప్రదాయాలు ఒక్కటేనని స్పష్టం చేశారు. ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు స్పందించాలని కోరారు.