Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ఎమ్మెల్యే సీతక్క చేతుల మీదుగా..
నవతెలంగాణ-మంగపేట
నాసిరెడ్డి వినరుకుమార్‌రెడ్డి స్మారకంగా మండలంలోని అకినేపల్లి మల్లారంలో ముస్తాబైన వైకుంఠధామాన్ని ఈనెల 9న ములుగు ఎమ్మెల్యే సీతక్క గ్రామ ప్రజలకు అంకితం చేయనున్నారు. మండలంలోని అకినేపల్లి మల్లారం గ్రామానికి చెందిన మణుగూరు హీరో షోరూమ్ యజమాని నాసిరెడ్డి విజరుభాస్కర్రెడి కుమారుడు వినరుకుమార్‌రెడ్డి పేరిట వైకుంఠధామాన్ని నిర్మించారు. ప్రభుత్వం గ్రామ పంచాయతీకి మంజూరు చేసిన వైకుంఠధామం గ్రామానికి ఆరు కిలోమీటర్ల దూరంలోని ఎస్టీ కాలనీలో ఉండగా ప్రజలు ఇబ్బందులు పడుతుండగా గ్రామస్తుల కోరిక మేరకు విజరుభాస్కర్‌రెడ్డి తన 30 గుంటల స్థలాన్ని వైకుంఠధామంగా అభివద్ధి చేసి సుమారు రూ.10 లక్షలు ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా నిర్మించారు. జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి కుటుంబ సభ్యుల సహకారంతో తన మాతమూర్తి నాసిరెడ్డి చిట్టెమ్మ జ్ఞాపకార్థం మరో 12 గుంటల స్థలాన్ని, లక్ష రూపాయల నగదును విరాళంగా ఇచ్చి గ్రామంలోని గోదావరి నదీ తీరం వెంట ఇరువురూ కలిసి రూ.20 లక్షల విలువైన ఎకరం స్థలాన్ని వైకుంఠధామానికి విరాళంగా అందించారు. ఏడాది క్రితం రోడ్డు ప్రమాదంలో మతి చెందిన వినరుకుమార్‌రెడ్డి పేరిట గ్రామస్తులకు అంకితమివ్వనున్నారు. అందులో రహదారుల నిర్మాణం చుట్టూ ఫెన్సింగ్ కళాతోరణం నిర్మాణం శివుడు నంది విగ్రహాలు దహన వాటిక గేట్ల ఏర్పాటు మొదలగు పనులు పూర్తి చేసి మంగళవారం ములుగు ఎమ్మెల్యే సీతక్క చేతుల మీదుగా గ్రామస్తులకు అంకితమివ్వనునట్లు తెలిపారు. వినరుకుమార్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ లోగోను ఎమ్మెల్యే సీతక్క ఆవిష్కరించనున్నట్లు జాతీయ మిర్చి టాస్క్‌ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి, వినరుకుమార్‌రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నాసిరెడ్డి విజయభాస్కర్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రజలు పాల్గొనాలని వారు కోరారు.