Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. కొత్తగూడ, గంగారం మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు. తొలుత గంగారం మండలంలోని కొడిశలమిట్టలో నిర్వహించిన పోడు భూములు, అటవీ సంరక్షణ సమావేశ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ఎఫ్ఆర్సీతో మాట్లాడారు. 12 గ్రామాల్లోని 31 అవాసాల పరిధిలో దరఖాస్తులు స్వీకరిస్తారని చెప్పారు. డిసెంబర్ 2005 నాటికి పోడు సాగులో ఉన్న గిరిజన రైతులు తగిన ఆధారాలతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. స్థానిక, మండల, జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలిస్తాయని తెలిపారు. 1930 నుంచి పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనేతరులు సైతం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేశారు. అనంతరం కొత్తగూడ మండలంలోని పోలారంలో నిర్వహించిన ఎఫ్ఆర్సీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. 24 గ్రామ పంచాయతీల్లోని 53 ఆవాసాల్లో గ్రామ కమిటీలు దరఖాస్తులు సేకరించడంతోపాటు అవగాహన కల్పిస్తాయని చెప్పారు. కార్యక్రమాల్లో జిల్లా గిరిజన అభివద్ధి అధికారి దిలీప్ కుమార్, కొత్తగూడ మండల ప్రత్యేక అధికారి సూర్యనారాయణ, ఆయా మండలాల తహసీల్దార్లు సూర్యనారాయణ, చందా నరేష్, ఎంపీడీఓలు శ్యాంసుందర్, కరణ్‌సింగ్, ఎఫ్ఆర్ఓ వజారత్, గ్రామ కమిటీల చైర్మన్లు ఈక భిక్షమ్, వజ్జ నర్సయ్య, ఎంపీపీ సరోజన, జెడ్పీటీసీ రమ, సర్పంచ్‌లు వజ్జ వెంకటలక్ష్మీ, పుల్సం లక్ష్మీ, ఎంపీటీసీ మోకాళ్ల సంతోష రాణి, తదితరులు పాల్గొన్నారు.
కేసముద్రం రూరల్ : మండలంలోని నారాయణపురంలో సర్పంచ్ లక్ష్మీపతి అధ్యక్షతన సభ నిర్వహించగా ముఖ్యఅతిథిగా తహసీల్దార్ కోమల పాల్గొని మాట్లాడారు. 2005 నాటికి పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులు, 90 ఏండ్లుగా పోడు సాగులో ఉన్న గిరిజనేతరులు హక్కు పత్రాలకు అర్హులని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ ధారావత్ రవినాయక్, ఉపసర్పంచ్ కన్యా నాయక్, వార్డు సభ్యులు కవిత ఉమేష్, టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఊకంటి యాకూబ్‌రెడ్డి, ఏఈఓ రాజేందర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్, ఏఓ వెంకన్న, స్పెషల్ ఆఫీసర్ రాజారత్నం, వీఆర్యే యుగంధర్, తారాసింగ్ తండ సర్పంచ్ శంకర్, పంచాయతీ కార్యదర్శులు అనిత, క్రాంతి, తదితరులు పాల్గొన్నారు.