Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై మరిన్ని పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య అన్నారు. ఖానాపురం మండలం అశోక్‌నగర్‌లోని కుదురుపాక వెంకన్న ప్రాంగణంలో సీపీఐ(ఎం) రెండో మహాసభను మద్ది అశోక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు చట్టాలను తీసుకొచ్చి కార్పొరేట్ కంపె నీలకు కొమ్ముకాస్తూ రైతుల నడ్డి విరి చిందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెట్రోల్, డీజిల్ ధరల వల్ల పేద సామాన్యుడి జీవనం ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం అనుసరిస్తున్న ఈ విధానాలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు. మరో వైపు రాష్ట్రంలోని కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడు తుందని విమర్శించారు. ఈ వైఫల్యాలను ఎండగట్టేలా హుజురాబాద్ ఉప ఎన్నికల్లో జనం గుణపాఠం చెప్పారని తెలిపారు. ఇప్పటికైన ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలతు చేసి చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలను తిప్పికొట్టేలా పోరాటాలను నిర్మించాలని సూచించారు. మహాసభ స్ఫూర్తితో మండలంలో పార్టీ విస్తరణకు పూనుకోవాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి రాబోయే రోజుల్లో మరిన్ని ఆందోళనలు చేపట్టాలన్నారు. ఈ మహాసభలో జిల్లా కమిటీ సభ్యులు ఈసంపెల్లి బాబు, భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి, కడియాల వీరాచారి, ఈదునూరి వెంకటేశ్వర్లు, హన్మకొండ శ్రీధర్, అనంతగిరి రవి, మండల కార్యదర్శి ముంజాల సాయిలు, కందికట్ల వీరేష్, ఉప సర్పంచ్ రాములు, మాజీ ఎంపీపీ చింతకింది రేణుక పాల్గొన్నారు.