Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కాజీపేట
బెజవాడకు తరలించిన క్రూ లింక్ ట్రైన్లను యథా విధిగా కాజీపేట క్రూ డిపోకు మార్చాలని తెలంగాణ రైల్వే జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు కొనసాగాయి. ఈ సందర్భంగా స్థానిక రన్నింగ్ రూమ్ ఎదుట కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ మాట్లాడుతూ.. తరలించిన లింకులను వెంటనే కాజీపేటకు కేటాయించాలన్నారు. సమస్యలు సష్టించి ఎలాంటి సమస్య లేనట్టు రైల్వే అధికార యంత్రాంగం వ్యవహరించడం సరి కాదన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కొండా నరసింహారావు, పాట వేద ప్రకాష్, శ్రీనివాస్, భాస్కర్, కె.వి.రావు, ప్రవీణ్, మురళి రమేష్ తదితరులు పాల్గొన్నారు.