Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -నెక్కొండ రూరల్
పోడు రైతులకు హక్కు పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం కషి చేస్తోందని జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న అన్నారు. సోమవారం నాగారంలో జరిగిన గ్రామసభకు ఆమె హాజరై మాట్లాడారు. ప్రభుత్వం పోడు భూములకు హక్కు కల్పించేందుకుగాను గ్రామాలలో కమిటీలను ఏర్పాటు చేస్తోందన్నారు. పొడుపై ఉన్న పోడుదారులను గుర్తించుటకు గాను ఈ కమిటీలు దోహద పడతాయని తెలిపారు.సభలో ఎంపీడీఓ రవి, జెడ్పీటీసీ సరోజన హరికిషన్, సర్పంచ్‌లు సుదర్శన్, గీత భాస్కర్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.
నల్లబెల్లి: మండలంలోని కొండాపురం, గోవిందాపురం గ్రామాలలో ఏర్పాటుచేసిన గ్రామ సభలకు సోమవారం జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న హాజరై ఆయా గ్రామాలలో ఫారెస్ట్ రైట్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జెడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జెడ్పీ సీఈవో రాజారావు మాట్లాడుతూ.. అర్హులైన ప్రతిఒక్కరూ ఫారెస్ట్ భూములకు సంబంధించిన హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఫారెస్ట్ రైట్ కమిటీలు గ్రామంలోని అర్హులకు అవగాహన కల్పించి ప్రతిఒక్కరీతో దరఖాస్తు చేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఊడుగుల సునీత ప్రవీణ్ గౌడ్, ఎంపీడీఓ విజరు కుమార్, ఎంపీఓ కూచన ప్రకాష్, సర్పంచులు గుబ తిరుపతమ్మ, వెంకట్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.