Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
రైతులకు లాభాసాటిగా నిలుస్తున్న పామాయిల్ సాగుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహాకాలు ఇస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం మేడేపల్లిలో పామాయిల్ పంట సాగుపై ఉద్యనవన శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన విజ్ఞాన యాత్ర లో ఆయన మాట్లాడారు. లాభసాటిగా ఉన్న ప్రత్యామ్నాయ పంటలపై వైపు రైతులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. పామాయిల్ పంట సాగు కోసం రాష్ట్ర ప్రభుత్వం పలు రకాల ప్రోత్సహాలను అందజేస్తుందని తెలిపారు. దేశం లో ఏ పంటకు లేనంతగా పామాయిల్ పంటకు ముందస్తు పెట్టుబడి ఇస్తూ ప్రోత్సహంగా రాయితీలను అందిస్తుందని తెలిపారు. పంట గ్యారెంటీ, మద్దతు ధర అందిస్తూ అందుబాట్లోనే పామాయిల్ పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేటపడుతుందన్నారు. సాగు చేస్తున్న రైతులకు డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీని అందిస్తుందని చెప్పారు. 5వేల మంది రైతులు అఫిడవిట్ ద్వారా మద్దతు తెలిపితే పామాయిల్ పరిశ్రమను నెల కొల్పేందుకు అనుమతులను ఇస్తుందన్నారు. పంట దిగుబడిని ముట్టజెప్పిన 72 గంటల్లో రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తారని తెలి పారు. పంటల నిర్వహణ, ఎరువుల ఖర్చులకు ఇతర పంటలకు హెక్టార్‌కు రూ.5వేలు ఇస్తుండగా ఆయిల్ ఫామ్ పంటలకు హెక్టార్‌కు రూ.32వేలు అందిస్తుందని తెలిపారు. ఎలాంటి వాతవరణంలోనైనా ఈ పంటను సాగు చేయవచ్చన్నారు. రైతులు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొనేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉద్యన వన, వ్యవసాయ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.