Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
రైతులు అధైర్యపడొద్దని, వారి ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తామని రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉనికిచర్లలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం యాసంగిలో వరిని కొనుగోలు చేసేది లేదని ఖరాఖండిగా చెబుతున్న నేపథ్యంలో రైతుల మరో 10-15 రోజులు వేచి చూసిన తర్వాతనే వరిని వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మ కవితా రెడ్డి, జెడ్పీటీసీ పిట్టల శ్రీలత, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ జూబెద లాల్ మహ్మద్, ఉనికిచర్ల గ్రామ అధ్యక్షులు పెద్ది నరేందర్ రెడ్డి, యూత్ అధ్యక్షుడు కోటగిరి శివ, మండల టీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి గుర్రాల రంజిత్, ఎస్సీ సెల్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ యేలీయ, పెద్ది శ్రీనివాస్ పాల్గొన్నారు