Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఎల్కతుర్తి
ఇందిరానగర్ నుంచి గోపాలపురం వరకు నిర్మించనున్న బీటీ రోడ్డు పనులకు సోమవారం హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ ప్రాంత వాసులు సౌకర్యార్థం అధికారులతో మాట్లాడి మూడు కోట్ల 24లక్షల రూపాయలతో ఈ రోడ్డు నిర్మాణం చేపడు తున్నట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఎంపీపీ మేకల స్వప్న, వైస్ ఎంపీపీ నగేష్, సింగిల్ విండో చైర్మన్ శ్రీపతి రవీందర్ గౌడ్, మండలాధ్యక్షుడు గొడిశాల సమ్మయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు
దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ అన్నారు. సోమవారం ఎల్కతుర్తి, దామెర గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యం క్వింటాల్‌కు 1960రూ.లు, బీ గ్రేడ్ ధాన్యం క్వింటాలుకు 1940రూ.లు చెల్లిస్తుందన్నారు. ధాన్యం విక్రయించినా వారం రోజుల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్టు పేర్కొన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.