Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జిల్లా ప్రథమ మహాసభను జయప్రదం చేయాలి
సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి
సారంపల్లి వాసుదేవరెడ్డి
వాల్పోస్టర్ ఆవిష్కరణ
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తోన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సారంపల్లి వాసుదేవరెడ్డి అన్నారు. సోమవారం రాంనగర్లోని పార్టీ కార్యాలయంలో ఈ నెల 23, 24న నిర్వహించే జిల్లా ప్రథమ మహాసభలను విజయవంతం చేయాలని ఆయన వాల్పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. కేంద్రంలోని బీజేపీ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. కార్పొరేట్ల లబ్దికోసం ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఆ హామీ అమలులో విఫలమైందని ఏద్దేవా చేశారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని మండిపడ్డారు. దళితులకు మూడెకరాల భూమి, పోడుభూములకు పట్టాలు, నిరుద్యోగులకు ఉపాధి తదితర హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా పార్టీ శ్రేణులు ఉద్యమించాలన్నారు. పార్టీ కార్యకర్తలకు ఉద్యమాల కార్యచరణ రూపకల్పన కోసం నిర్వహించే పార్టీ జిల్లా మహాసభను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ ప్రభాకర్ రెడ్డి, రాగుల రమేష్, జిల్లా నాయకులు గొడుగు వెంకట్, జీ రాములు, వీ వీరన్న, డీ తిరుపతి, మండల నాయకలు వేల్పుల సారంగపాణి, డీ భానునాయక్ తదితరులు పాల్గొన్నారు.