Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వేలేరు
మండలంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలెప్పుడూ ప్రారంభిస్తారని యూత్ కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, వేలేరు ఉపసర్పంచ్ సద్దాం హుస్సేన్ ప్రశ్నించారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కోసం నేటి వరకూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడం శోచనీయమన్నారు. స్థానిక రైతులు ఐకేపీ సెంటర్కు వడ్లు తీసుకొచ్చి 15రోజులు గడిచినా ధాన్యం కొనుగోలు చేయలేదన్నారు. వెంటనే ప్రజా ప్రతినిధులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షులు జుర్రు సంపత్, నాయకులు దండ బుచ్చిరెడ్డి, భత్తుల రాజయ్య, సూత్రపు కొమురయ్య, మైనార్టీ సెల్ అధ్యక్షులు సలీమ్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.