Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
వరంగల్ మహానగర పాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల నుంచి కమిషనర్ ప్రావీణ్య వినతులను స్వీకరించారు. నీటి సమస్యపై 2, ఆరోగ్యం పారిశుద్ధ్యం నుంచి 8, ఇంజినీరింగ్ సెక్షన్ గురించి 6, టౌన్ ప్లానింగ్ 21, రెవెన్యూ 7లతో కలిపి మొత్తం 44ఫిర్యాదులు అందాయి.
31వ డివిజన్ జ్యోతిరావుపూలే కాలనీలో కనీస సౌకర్యాలు కల్పించాలని సీపీఐ(ఎం) హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పరిశుభ్రమైన తాగునీరు అందజేయాలని కిషన్‌పురాకు చెందిన చల్లా శ్రీనివాస్ రెడ్డి వినతిపత్రం అందజేశారు. బీహార్ నగర్లో రోడ్డుకు సెట్ బ్యాక్ లేకుండా ఇంటి నిర్మాణం చేస్తున్నారని చల్ల రాజిరెడ్డి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ సత్యనారాయణ, ఇన్చార్జి అదనపు కమిషనర్ విజయలక్ష్మి, సీపీ వెంకన్న, డిప్యూటీ కమిషనర్లు జోనా, రవీందర్ యాదవ్, సీహెచ్ఓ సునీత, ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పెద్దమ్మగడ్డ జ్యోతిబసు నగర్ ఫేస్ టు కాలనీకి వెళ్లే మార్గంలో సీసీ రోడ్డు వేయాలని హన్మకొండ నార్త్ జోన్ సీపీఐ(ఎం) కమిటీ ఆధ్వర్యంలో మండల బాధ్యుడు గాద్ఱె రమేష్ సోమవారం కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఇంజపెళ్లి రాజు, వెల్దండి భాస్కర్, రేగుల రవి, బండి సమ్మయ్య, కేత పాక అశోక్, ఇంజపెళ్లి చిరంజీవి, క్రాంతి తదితరులు పాల్గొన్నారు.