Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో తహశీల్దార్‌కు వినతి
నవతెలంగాణ-వేలేరు
ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న పట్టాలివ్వాలని సోమవారం సీపీఐ(ఎం) మండల బాధ్యుడు వేల్పుల రవి ఆధ్వర్యంలో తహశీల్దార్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కన్నారం గ్రామంలోని సర్వే నంబర్లు 197/1, 192, 207, 30/2, 74/1, 81, 75, 124, 78/1, 48/2, 123, 69, 73, 76/1, 77, 79, 80, 125లలో మొత్తం 211ఎకరాల ప్రభుత్వ భూమిలో ఆ గ్రామంలోని దళితులు సాగు చేసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ భూమి లేని దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న వాగ్దానం మేరకు ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న దళితులకు వెంటనే పట్టాలివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మిడిదొడ్డి యాకోబు, శ్రీనివాస్, నిర్మల, వీ నవరత్న, కొయ్యడ మరియా, విజయ రాణి తదితరులు పాల్గొన్నారు.