Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేంద్రం మూసధోరణిని విడనాడాలి
పంచాయతీ రాజ్ శాఖ మంత్రి
ఎర్రబెల్లి దయాకర్ రావు
నవతెలంగాణ రాయపర్తి
టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తోందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం తిర్మలాయ పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో, మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన జిల్లా కలెక్టర్ గోపితో కలిసి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ .. విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చి ందన్నారు. కేంద్రసర్కారు మూసధోరణి అవ లంభిస్తున్నా.. నూతన చట్టాలతో అడ్డుపడుతున్నా.. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందనానరు. కొనుగోళ్లకు ఆటంకం కలగకుండా చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ధాన్యం కొనుగోలు సెంటర్ల వారికి ట్రాన్స్ పోర్ట్ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు.
గతంలో కొన్న వడ్ల నిల్వలు అధికంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయడం అభినందనీయమన్నారు. వరి సాగు కాకుండా లాభసాటి ప్రత్యామ్నాయ పంటలపై కూడా రైతులు దృష్టి సారించాలని సూచించారు. తిర్మలాయపల్లి గ్రామానికి 40 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేసినటు, ్ల అవసరమైతే మరో 20ఇండ్లు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో పంటల సాగుపై రైతులను చైతన్యం కలిగించాలని కోరారు. మండల వ్యాప్తంగా 23ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. రైతులు అధికారులు సమన్వయంతో పని చేస్తూ ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సంపత్ రావు, ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగు కుమార్, పీఎసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ, ఎంపీడీఓ కిషన్, ఏఓ వీరభద్రం, ఏపీఓ అశోక్, సర్పంచులు గారె నర్సయ్య, అనంత ప్రసాద్, ఎంపీటీసీలు రాంచందర్, రాధిక సుభాష్ రెడ్డి, రైబస మండల అధ్యక్షుడు సురేందర్ రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహా నాయక్ పాల్గొన్నారు.