Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈనెల 16న నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 16 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 23 నామినేషన్ల స్వీకరణకు తుది గడువు కాగా 24న నామినేషన్ల పరిశీలన, 26న నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. డిసెంబర్ 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు జరుగనుంది. వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి పదవీ కాలం 2022 జనవరి 4న ముగియనుంది.
నేటి సీఎం పర్యటన రద్దు
'విజయగర్జన'కూ కోడ్ దెబ్బ
ఈనెల 10న సీఎం కేసీఆర్ హన్మకొండ జిల్లా పర్యటన రద్దయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రాగా సీఎం పర్యటనను రద్దు చేసుకున్నారు. నేడు హన్మకొండలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంతోపాటు అభివృద్ధి పనులను సమీక్షించడానికి సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. దీక్షా దివాస్ సందర్భంగా ఈనెల 29న గ్రేటర్ వరంగల్ నగరంలోని దేవన్నపేటలో నిర్వహించనున్న 'విజయగర్జన' సభ కూడా ఎన్నికల నోటిఫికేషన్‌తో రద్దయ్యింది.
పరేషాన్ చేసిన టీఆర్ఎస్ నేతలు
దేవన్నపేట వద్ద విజయగర్జన బహిరంగ సభ ఏర్పాటు చేయడానికి సుమారు 500 ఎక రాల్లో భూమిని చదును చేశారు. గత మూడ్రో జులుగా 220 మంది కూలీలను పెట్టి 30 జేసీబీలు, 30 ట్రాక్టర్లు, 32 డోజర్లతో పొలాలు, ప్లాట్లను చదును చేశారు. తాజాగా ఎమ్మెల్సీ ఎన్ని కల నోటిఫికేషన్ రావడంతో విజయగర్జన సభ రద్దయ్యింది. ఈ క్రమంలో ప్లాట్ల యజమానులు తమ ప్లాట్లకు మళ్లీ హద్దులు గుర్తించి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.