Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లింగాలఘణపురం
మండలం జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి దేవస్థాన పాలక మండలి వారు , జనగామ శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పచ్చం అందించారు. ఈనెల 24 వ తారీకున శ్రీ(వీరాచల జీడికంటి) శ్రీ రామచంద్ర స్వామి తిరుక్కళ్యాణ మహౌత్సవ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఎమ్మెల్యే ని ఆహ్వానించిన వారిలో ఆలయ చైర్మన్ స్థానిక మధు , టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడుగుల కిష్టయ్య. పట్టణ వార్డు కౌన్సిలర్ జూకంటి లక్ష్మి శ్రీశైలం. పాలక మండలి సభ్యులు కొత్తకొండ గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.