Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మల్హర్రావు
రాష్ట్రంలో మద్యం విక్రయాలను పెంచాలనుకోవడం సిగ్గుసేటని ఎంపీపీ చింతలపల్లి మల్హర్రావు అన్నారు. మంగళవారం మండలంలోని రుద్రారంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎంపీపీ మాట్లాడారు సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి మద్యం మీదున్న శ్రద్ధ విద్య, వైద్యంపై లేదన్నారు. రాష్టంలో అదనంగా 350 మద్యం దుకాణాలు పెంచడం దేనికని ప్రశ్నించారు. రాష్టం మొత్తం బెల్టుషాపులు నిర్వహిస్తూ అక్రమ పద్ధతిలో ఆదాయం పెంచుకొంటోందని ఆరోపించారు. ప్రజలను తాగు బోతులుగా మార్చి వారి కుటుంబాలను రోడ్డున పడేలా యత్నించడం సరికాదన్నారు. జిల్లాకో వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు కు కృషి చేయకుండా మద్యం వైపు దృష్టిసారించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ బడితేల స్వరూపరాజయ్య, సింగిల్ విండో డైరెక్టర్లు ఇప్ప మొండయ్య, సంగ్గెం రమేష్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి జంగిడి శ్రీనివాస్, ఎడ్లపల్లి సర్పంచ్ జనగామ స్వరూపబాపు, నాయకులు బోగే మల్లయ్య, చిగురు సదయ్య పాల్గొన్నారు.