Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలని ఏడీ డాక్టర్ శ్రీదేవి రైతులకు సూచించారు. మంగళవారం పరశురాంపల్లి గ్రామంలో 209 పశువులకు టీకాలు వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చలి కాలంలో పశువులకు గాలికుంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. ముందస్తు టీకాలతో పశువులు రోగాల బారిన పడవని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారి పవన్‌కుమార్‌రెడ్డి, గోపాల మిత్రలు రాజేంద్రచారి, దామోదర్, సురేందర్, తదితరులు పాల్గొన్నారు.