Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
నేషనల్ హెల్త్ మిషన్ పథకం ద్వారా జిల్లాలోని పల్లె దవాఖానాల్లో నలుగురు వైద్యులను అవుట్ సోర్సింగ్ విధానంలో జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా నియమించారు. 30మంది ఎంబీబీఎస్ వైద్యుల నియామకానికి గతంలో నోటిఫికేషన్ జారీ చేయగా మంగళవారం కలెక్టర్ కార్యా లయంలో నిర్వహించిన ఇంటర్వ్యూకు నలుగురు అభ్యర్థులు హాజర య్యారు. వారి సర్టిఫికెట్లను పరిశీలించి ఇంటర్వ్యూ చేసి వారిని పల్లె దవాఖానాల్లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వైద్యులుగా నియమించారు. నీతి అయోగతో అత్యంత వెనుకబడిన జిల్లాగా గుర్తింపు పొందిన ఈ జిల్లాలో ప్రజలకు వైద్య సేవ చేయడానికి చాలా అవకాశం ఉందని అన్నారు. రోజువారి వైద్య సేవలతోపాటు మాతా,శిశు సంరక్షణ, సీజనల్, సాధారణ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిస్, క్యాన్సర్ తదితర వ్యాధిగ్రస్తులకు వైద్య సేవలందించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. డీఎంహెచ్ఓ శ్రీరామ్, ఎన్హెచ్ఎం పీఓ చిరంజీవి, జిల్లా ఎస్సీ అభివృద్ధిఅధికారి సునిత పాల్గొన్నారు.