Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు
నవతెలంగాణ-మల్హర్రావు
మల్హర్రావు మండలవ్యాప్తగా ఈ ఖరీఫ్‌లో 15వేల ఎకరాల్లో రైతులు వరి పంట సాగు చేశారు. వారం రోజులుగా వరి కోతలు మొదలయ్యాయి. చెరువులు, కుంటల కింద తడి రాకపోవడంతో షైన్ మిషన్లతో కోస్తు న్నారు. ప్రస్తుతం ఆ ధాన్యమంతా ఆయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో కుప్పలుగా పోసి ఆరబోశారు. అయితే అమ్మకానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు. మండలవ్యాప్తంగా 15 గ్రామపంచాయతీల పరిధిలో 11 కొనుగోలు కేంద్రాలు తాడిచెర్ల వ్యవసాయ ప్రాథమిక సహాకార సంఘం ఆధ్వ ర్యంలో గత రబీ సీజన్లో ఏర్పాటు చేశారు. వానాకాలం వడ్ల సేకరణలో ఇంకా స్పష్టత రాకపోవడంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మళ్ళీ అకాల వర్షాలు వస్తే కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఉంటుందని, ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యం పంట చేతికి వచ్చాక నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత యాసంగిలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు యథాతదంగా ఈ ఏడాది వానాకాలం వడ్లు కొనుగోలు చేయడానికి ఎన్ని రోజులవు తుందోనని ఆవేదనచెందుతున్నారు. ఇప్పటికైనా కొను గోలు కేంద్రాలు ప్రారంభించాలని మండల రైతులు డిమాండ్ చేస్తున్నారు.