Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జెన్కో సంస్థ ఆదేశాల మేరకే సర్వే ప్రారంభం
అ భూ నిర్వాసితుల కమిటీ
నవతెలంగాణ-మల్హర్రావు
తాడిచర్ల బ్లాక్-1 ఓసీపీికి 500 మీటర్ల డేంజర్ జోన్లో జరుగు తున్న భూ సర్వేపై నిర్వాసితులు అయోమయానికి గురై ఎలాంటి అపో హలు పెట్టుకోవద్దని భూ నిర్వాసితుల సంఘం స్పష్టం చేసింది. మంగళ వారం మండల కేంద్రంలో భూ నిర్వాసితుల కమిటీ అధ్యక్షుడు దండు రమేష్ ఆధ్వర్యంలో భూ నిర్వాసితులు విలేకరుల సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల జెన్కో, రెవెన్యూ అధికారులు డేంజర్ జోన్లో ఉన్న భూములు, ఇండ్లు సర్వే నిర్వహిస్తున్న క్రమంలో భూ నిర్వాసితుల్లో పలు అనుమానాలతో పాటు అపోహలు వస్తున్నట్లు తెలిసిందని అన్నారు. జెన్కో ఉన్నతాధికారులు, భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకే అధికారికంగా సర్వేలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. పదేండ్ల కిందట ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా నిర్వాసి తులను మభ్య పెట్టడానికి రెవెన్యూ అధికారులు చేసిన సర్వే అవాస్తవం నిజమేనని తెలిపారు. ప్రస్తుతం చేపట్టిన సర్వేకు పూర్తి ఆధారాలతోపాటు, జెన్కో సంస్థ నుంచి ఏప్రిల్‌లో ఆదేశాల పత్రాలు వచ్చినట్లు చూపించారు. 2013 చట్టం ప్రకారం భూములు, ఇండ్లు సేకరించాలని పదేండ్లుగా భూ నిర్వాసితుల కమిటీ చేసిన నిరసనలు, ధర్నాలు, పోరాటాల ఫలితమే సర్వే అన్నారు. టీఎస్ జెన్కో సంస్థ ఏప్రిల్‌లో ఓసీపీికి 500 మీటర్ల డేంజర్ జోన్ లో ఉన్న 359.23 ఎకరాల భూమి, అందులో ఉన్న ఇండ్లను, బావులు, బోర్లు తదితర వాటితోపాటు భూ సేకరణ చేపట్టాలని జెన్కో సంస్థలో ఒకరైన డైరెక్టర్ అజరు భూపాలపల్లి కేటీపీపి అధికారులకు ఆదేశాల పత్రం పంపినట్టు తెలిపారు. నిర్వాసితులు సర్వేపై అపోహలు విడి సర్వే బృందాలకు సహకరించి తమ ఆస్తులను దగ్గర ఉండి సర్వే చేయించుకోవాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసిత కమిటీ సభ్యులు దన్నపనేని రాజేశ్వర్‌రావు, అశోక్‌రావు, ఇందారపు చంద్రయ్య, సాయిని రాజయ్య, అజ్మత్ హలీ, గట్ల సత్యనారాయణ, కేసారపు చంద్రయ్య, రేపాల శ్రీనివాస్, గుర్రాల మొగిలి, రామిడి గట్టయ్య, సదానందం, ప్రభాకర్, రవి, వేణు, సదువలి తదితరులు పాల్గొన్నారు.