Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధర్మసాగర్
నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలోని తిరుమలగిరి మండలంలోని తొండ గ్రామానికి చెందిన శిరస్సు ఉప్పలయ్య కేవలం రూ.600ల జీతంతో ఉపాధ్యాయుడిగా జీవిత ప్రస్థానాన్ని మొదలెట్టి తదనంతర కాలంలో అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ప్రస్తుతం 'సురక్షా ఇన్ఫ్రా ప్రాజెక్ట్' చైర్మెన్‌గా దాదాపు 6 వేల మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశం కల్పించే స్థాయికి ఎదిగాడు. ఈ నేపథ్యంలో ఆయనతో 'నవతెలంగాణ' ముఖాముఖి.
మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేపట్టడానికి గల కారణాలేమిటి?
సర్వ జనాభివృద్ధికి భూమి కీలకం. ఇది నేను చిన్నతనంలోనే గుర్తించాను. మా నాన్న గారు వ్యవసాయం చేస్తూ చదివించాడు. కష్టపడడాన్ని, సామాజిక సేవల ద్వారా ఇతరులకు అండగా నిలవడాన్ని అలవర్చాడు. భూమిని నమ్ముకున్న ఎవరు కూడా చెడిపోరన్నది నేను అనుభవ పూర్వకంగా తెలుసుకున్న అక్షరసత్యం. చదువుకునే రోజుల్లోనే కుటుంబ బాధ్యతలు మీద పడ్డాయి. విద్యార్థి దశలోనే వివాహమూ జరిగింది. ఈ క్రమంలో రూ.600ల జీతానికి ఉపాధ్యాయుడిగా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. కుటుంబ పోషణకు, సామాజిక సేవలకు రూ.600లు జీతం సరిపోకపోవడంతో సొంతగా స్కూల్ స్థాపించాను. పాఠశాలను నడుపుతూనే ఎల్ఐసీ ఏజెంట్‌గా బిజినెస్ చేశాను. అయినా ఆదాయం సరిపోకపోవడంతో హైదరాబాద్‌కు చేరుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాను.
రాజకీయాలతో మీకున్న అనుబంధం ఏమిటి?
ఎవరికి కష్టం వచ్చినా అండగా నిలవడం నాకు చిన్నతనం నుంచే అలవాటు. ఇదే నన్ను రాజకీయాల వైపు నడిపించింది. పాఠశాల నడుపుతూనే ఎల్ఐసీ ఏజెంట్‌గా బిజినెస్ చేసిన సమయంలోనే మండల స్థాయిలో రాజకీయాల్లోకి అడుగు పెట్టాల్సి వచ్చింది. అంచెలంచెలుగా ఎదుగుతూ అనతికాలంలోనే జిల్లా రాజకీయాల్లోకి చేరుకున్నాను. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. దీంతో హైదరాబాద్‌కు చేరుకుని ఓ మిత్రుడి సలహాతో రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టాను.
రియల్ ఎస్టేట్ వ్యాపారాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
భూమి విలువ ఎన్నడూ తగ్గిన దాఖలాలు చరిత్రలోనే లేవు. అందుకే భూమ్మీద పెట్టుబడి పెడితే ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఆ నమ్మకంతోనే ముందడుగు వేశాను. గతంలో రూ.200లు, రూ.300లు, రూ.500లకు గజం చొప్పున లభించే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం ఓ చిన్నపాటి పట్టణాల్లో చూసినా గజానికి రూ.5 వేలకు పైగా పలుకుతోంది. నేను రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చిన తొలిరోజుల్లో నా ద్వారా భూమిని కొనుగోలు చేసిన వ్యక్తులు అనతికాలంలోనే వందల రెట్ల ఆదాయం పొంది సంపన్నులయ్యారు. నా కస్టమర్లు లాభాలు పొందుతూ నాకు ఆత్మ బంధువులయ్యారు. ఈ క్రమంలోనే నా రియల్ ఎస్టేట్ వ్యాపారమూ పెరిగింది.
రియల్ ఎస్టేట్ రంగంలో ఎలా ఎదిగారు?
ఏ పని చేయాలన్నా నిశిత పరిశీలన, అధ్యయనం కీలకం. నేను ఉపాధ్యాయుడిగా జీవిత ప్రస్థానం మొదలుపెట్టినప్పుడు ఆ అనుభవంతో పాఠశాల ఏర్పాటు చేశాను. కుటుంబ పోషణ, సామాజిక సేవలకయ్యే ఖర్చులు పెరగడంతో ఎల్ఐసీ ఏజెంట్‌గా కూడా బిజినెస్ చేశాను. అదే సమయంలో రాజకీయాల్లోకి రావడంతో ఖర్చులు భారీగా పెరిగాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ సామాజిక సేవలు అందించడం కష్టమనే అభిప్రాయాన్ని వచ్చిన నేను 2005లో తొలిసారిగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో రూ.10 వేల జీతంతో చేరాను. అనంతరం మరో కంపెనీలో సీఈఓగా ఉద్యోగం వచ్చింది. తదనంతరం మరో కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేశాను. చివరకు సొంతంగా 'సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్' ఏర్పాటు చేశాను.
మీ సక్సెస్‌కు గల కారణాలేంటి?
తక్కువ లాభాన్ని చూసుకుంటూ ఎక్కువ బిజినెస్ చేయడం ద్వారానే నేను సురక్షా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగాను. వ్యాపారం పట్ల నిబద్ధత, కస్టమర్లకు ఖచ్చితంగా లాభాలు చూపించగలిగిన అనుభవం నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది.
'రియల్' వ్యాపారం మీకు తృప్తినిస్తోందా?
రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి వచ్చిన తొలి రోజుల్లో పదుల సంఖ్యలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాను. వ్యాపారాన్ని విస్తరిస్తూ ప్రస్తుతం సుమారు 6 వేల మందికి ఉపాధి కల్పించాను. నా కస్టమర్ల, ఉద్యోగులకు రక్ష కల్పించాలనే ఉద్ధేశ్యంతోనే ఆ పదం కనిపించేలా 'సురక్షా' పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నా. తక్కువ ధరకే భూమిని అందిస్తూ కస్టమర్లకు ఎక్కువ లాభాలు చేరూర్చడమే నా లక్ష్యం. అదే నన్ను లాభాల్లోకి నడిపిస్తూ ఎంతో తృప్తినిస్తోంది.
మీకు ఎవరైనా తోడ్పాటు అందించారా?
నా బాల్యమిత్రుడు వినోద్ నన్ను తొలి దశలో ప్రోత్సహించాడు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణించేలా సూచనలు, సలహాలు అందించాడు. అనంతరం ఓ కంపెనీ సీఈఓగా నాకు ఉద్యోగ అవకాశమిచ్చిన గురు రాజు నాకు స్ఫూర్తినిచ్చారు. తదనంతర కాలంలో నాగేశ్వర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి నాకు తోడ్పాటు అందించారు. హైదరాబాద్‌లో వీరి సహకారం వల్లే నేను రాణించగలిగాను.
మీ వెంచర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి?
పసుముల ప్రాంతంలో డీటీసీపీ లేఔట్ కలిగిన అభిస్ ఆలోహ, మంగపల్లి జంక్షన్ ప్రాంతంలో ముకుంద గ్రీన్స్, కీసర రోడ్డు ప్రాంతంలో ఈస్టర్న్ ప్రైడ్, సాయినగర్, వరంగల్ పోచంపల్లి రోడ్డు ప్రాంతంలో ఫ్యూచర్ సిటీ, యాదాద్రి జిల్లా రామాజీపేట్ విలేజ్ వంగపల్లి ప్రాంతంలో టెంపుల్ సిటీ, జనగామ జిల్లా ప్రాంతంలో చంపక్‌హిల్స్, హైదరాబాద్ బాచారం ప్రాంతంలో హైవేకి అతి సమీపంలో సురక్ష హైట్స్ వెంచర్లు ఉన్నాయి.