Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ధర్మశ్రీ' చైర్పర్సన్ ధరావత్ విమల
నవతెలంగాణ-తొర్రూర్ టౌన్
దాతత్వం స్ఫూర్తిదాయకమని ధర్మశ్రీ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ ధరావత్ విమల అన్నారు. డివిజన్ కేంద్రంలోని ఐదో వార్డులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆ ట్రస్ట్ ఆధ్వర్యంలో అద్విత గ్లోబల్ హెల్త్ కేర్ సంస్థ సౌజన్యంతో టప్పర్ వేర్ హెల్త్ కిట్ బాక్సులను 5వ వార్డు కౌన్సిలర్ ధరావత్ సునీత జైసింగ్ చేతుల మీదుగా అందించారు. అనంతరం విమల మాట్లాడారు. ప్రతిఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించడాన్ని అలవర్చుకోవాలని కోరారు. పాఠశాల స్పెషల్ ఆఫీసర్ శైలజ మాట్లాడుతూ ట్రస్ట్ ఆధ్వర్యంలో పాఠశాలలో రెండేండ్లుగా సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. తదనంతరం విమల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు మాధవి, విజయ, మణెమ్మ, పల్లవి, వెంకటలక్ష్మీ, విజయ, నాగమణి తదితరులు పాల్గొన్నారు.