Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-మహబూబాబాద్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో గాంధీపురం శాఖ పరిధిలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు సమ్మెట రాజమౌళి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంతోపాటు రైతులకు మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి ఏడాది గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతుల పోరాట పట్ల స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్శి గుండమల్ల ఉప్పలయ్య, స్వామిదాస్, నర్సయ్య, కాగితపు వెంకటమల్లు, తీగల ఉప్పలయ్య, బానోతు మంగ్యా, కాగితపు నర్సయ్య, ధర్మ మంగీలాల్, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
గార్ల :రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేసి గిట్టుబాటు ధరలు కల్పించాలని సీపీఐ(ఎం) మండల నాయకులు వంగూరి పెద్ద వెంకటేశ్వర్లు, చింత ఎల్లయ్య, మల్లెల నాగమణి డిమాండ్ చేశారు. మండలంలోని పినిరెడ్డిగూడెం గ్రామంలోని ఆటో సెంటర్లో ఆ పార్టీ మండల కమిటీ ఆద్వర్యంలో మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు, ఎల్లయ, నాగమణి మాట్లాడారు. ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం సరికాదన్నారు. దళారులను, వ్యాపారస్తులు ఆశ్రయించి రైతులు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొందని ఆందోళన వెలిబుచ్చారు. కార్యక్రమంలో నాయకులు కొండయ్య, వీరన్న, సీతారాం, వెంకట్, శ్రీనివాస్, సురేష్, అజరు, ఆనంద్, కొండల్‌రెడ్డి, పద్మ, రాంబాయి, సైదులు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
బుద్దారంలో.. : సీపీఐ(ఎం), రైతు సంఘాల అధ్వర్యంలో గ్రామంలోని చౌరస్తాలో అందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం), రైతు సంఘాల జిల్లా నాయకులు మేదరమెట్ల గిరి ప్రసాద్, భాగం లోకేశ్వర్‌రావు మాట్లాడారు. ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ప్రకటించడం దారుణమన్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయకుంటే అందోళనలను ఉధతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ శాఖ కార్యదర్శి గుంటి శ్రీను, నాయకులు గౌని ఉపేందర్, తోట బిక్షం, గౌని వాణి తదితరులు పాల్గొన్నారు.