Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
అర్హులందరికీ పోడు భూములపై హక్కు కల్పిస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు. మండలంలోని రామచంద్రపురం గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్తతండా, ఆల్లిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని పంది పంపులలో పోడు భూములు, అటవీ సంరక్షణ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. పోడు సాగు చేస్తున్న రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆవాస గ్రామాల్లో ఎఫ్ఆర్సీలు ఏర్పాటు చేశామన్నారు. రైతుల దరఖాస్తులను స్థానిక, మంల, సబ్ డివిజనల్, జిల్లా స్థాయి కమిటీలు పరిశీలిస్తాయని వివరించారు. 2005 డిసెంబర్ 13 నాటికి పోడు భూముల్లో సాగు చేస్తున్న రైతులు హక్కు పొందేందుకు అర్హులన్నారు. దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించారు. పందిపంపుల గ్రామ రైతుల కోరిక మేరకు 16 వేల ఎకరాలపై మాట్లాడుతూ 9 వేల ఎకరాల్లో రెవెన్యూ భూమికి పట్టా పాసు పుస్తకాలు ఇచ్చామని, మిగతా 7.50 ఎకరాల్లో 3.50 ఎకరాలు రెవెన్యూ పరిధి కాగా మిగతా నాలుగెకరాలకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇక నుంచి పోడు కొట్టమని, అడవుల సంరక్షణకు పాటు పడతామని గ్రామస్తులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రామకష్ణ, ఎఫ్డీఓ కష్ణమాచారి, ఎఫ్ఆర్ఓ సువర్చల, తహసీల్దార్ నాగభవానీ, ఆయా గ్రామాల సర్పంచ్‌లు పొలెబోయిన వెంకటేశ్వర్లు, చింత సుభద్ర, ఎఫ్ఆర్సీ చైర్మెన్లు వాంకుడోత్ వాచ్యా, సనప రాంబాబు, పీఏసీఎస్ చైర్మెన్ మూల మధుకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.