Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.28 లక్షల కుంభకోణ ప్రకటన కుట్రే
ఆర్నెళ్లు గడుస్తున్నా ఎవరూ ఫిర్యాదు చేయలేదు
టీఆర్ఎస్ నాయకులు అజ్మీరా రఘు సింగ్
నవతెలంగాణ-శాయంపేట
వరి ధాన్యం కొనుగోలులో రైతుల డబ్బులు తన ఖాతాలో జమ చేసుకొని తిరిగి రైతులకు డబ్బులు చెల్లించానని టీఆర్ఎస్ నాయకులు అజ్మీర రఘు సింగ్ తెలిపారు. మండల కేంద్రంలో కాట్రపల్లి రైతులతో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరి ధాన్యం కొనుగోలులో 400 మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయగా 36 మంది రైతుల డబ్బులు వారి బ్యాంకు ఖాతాలు లేకపోవడంతో తన ఖాతాలో జమ చేసుకొని తిరిగి చెల్లించానని తెలిపారు. దత్తత గ్రామంలోని కెనరా బ్యాంక్లో వ్యక్తిగత రుణాలు, గొర్రెల, బర్రెల రుణాలు గ్రామంలోని 400 మంది రైతులకు ఇవ్వడంతో తిరిగి రుణాలు చెల్లించక పోవడంతో రైతులు బ్యాంకు ఖాతాలను వినియోగించడం లేదని, బ్యాంకు ఖాతాలో డబ్బులు జమయితే బ్యాంకు అధికారులు రికవరీ చేసుకుంటారని భయంతో తమ బ్యాంకు ఖాతా ఇవ్వడం లేదని తెలిపారు. గ్రామ స్థాయి నాయకుల కుట్రతోనే తనపై రూ.28 లక్షల కుంభకోణం ప్రకటన ఇచ్చారని చెప్పారు. గ్రామంలోని రైతులను విచారణ చేస్తే తన నిజాయితీ నిరూపితమౌతుందని తెలిపారు. ఆర్నెళ్లు రైతులెవరూ ధాన్యం డబ్బులు రాలేదని ఏ అధికారి దగ్గర కూడా ఫిర్యాదు చేయలేదన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను ఓర్వలేక గ్రామ స్థాయి నాయకులు కుట్ర పన్నారని ఆరోపించారు