Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మర్రిగూడెం, పుల్లూరు గ్రామాల్లో గృహ ప్రవేశం
నవతెలంగాణ-గార్ల
ఇల్లు లేని పేదోడి సొంతింటి కల నెరవేర్చడమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ తెలిపారు. రానున్న రోజుల్లో ఇంటి స్థలాలున్న ప్రతీ ఒక్కరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించడానికి కృషి చేస్తామని చెప్పారు. మండలంలోని మర్రిగూడెం, పుల్లూరు గ్రామ పంచాయతీల్లో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మంగళవారం గహా ప్రవేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అయా గ్రామ సర్పంచ్‌లు భూక్య బుజ్జి, మాలోత్ జ్యోతి అధ్యక్షతన జరిగిన సభలో ఎమ్మెల్యే హరిప్రియ మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో పేదలకు అరకొర వసతులతో ఇండ్లు నిర్మాణం చేయగా స్వరాష్ట్రంలో అన్ని రకాల సౌకర్యాలతో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించినట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కషి చేయాలని కోరారు. పుల్లూరులో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం స్థలం దానం చేసిన బానోత్ రవిను ఎమ్మెల్యే హరిప్రియ శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మూడ్ శివాజీ చౌహాన్, సొసైటీ అధ్యక్షుడు వడ్లమూడి దుర్గాప్రసాద్, సర్పంచ్‌లు సక్రు, మోతీలాల్, రాంబాయి, ప్రవళిక, ఉషా, ఎంపీటీసీ మంజుల, అధికారులు స్వాతి బిందు, రవీందర్రావు, సీఐ తిరుపతి, ఎస్సై బాదావత్ రవినాయక్, సాలార్, కిషోర్, సుధాకర్, వెంకటేశ్వర్లు, నాయకులు గంగావత్ లక్ష్మణ్‌నాయక్, బానోత్ రవి, శంకర్, హరినాయక్, సురేష్, నాగరాజు, కిషన్ తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడెంలో అరోగ్య ఉపకేంద్రం ప్రారంభం
మండలంలోని మర్రిగూడెం గ్రామంలో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించే ఉద్దేశంతో నిర్మాణం చేపట్టిన ప్రాథమిక అరోగ్య కేంద్రాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటికి ప్రభుత్వ వైద్యం అందించడానికి వైద్య అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్ భూక్య బుజ్జి, ఎంపీపీ మూడ్ శివాజీ చౌహన్, డీఎంహెచ్ఓ హరీష్ రాజ్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అంబరీష, వైద్య అధికారిణి ప్రణవి, సిబ్బంది ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.