Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
హైదరాబాద్-విజయవాడ ప్రాంతాల నుంచి రోజువారీగా కిరాణా సరుకులు తెచ్చే ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో అక్రమంగా గుట్కా, అంబర్ ప్యాకెట్లలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వివరాలు వెల్లడించారు. మహబూబాబాద్‌లోని ఎంహెచ్కే ట్రాన్స్పోర్ట్ లారీని తనిఖీ చేయగా 7 బ్యాగుల్లో గుట్కా, 39 బ్యాంకుల్లో అంబర్ ప్యాకెట్లు లభించినట్టు తెలిపారు. సదరు బ్యాగులను పడిగల సోమయ్య, భాస్కర్, కష్ణ జనరల్ స్టోర్, కర్లపాటి రమేష్ బాబు, కర్లపాటి నారాయణమూర్తి, శివనరేష్లవిగా గుర్తించినట్టు చెప్పారు. పోలీసుల నిఘా పెరగడంతో ఆక్రమార్కులు కొత్త పంథాలో ట్రాన్స్పోర్ట్ వాహనాల్లో తెప్పించుకుంటన్నారని తెలిపారు. గుట్కా ప్యాకెట్ల విలువ రూ.72 వేలు, అంబర్ ప్యాకెట్ల విలువ రూ.12.74 లక్షలు ఉంటుందని వివరించారు. కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్రావు, మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ వెంకటరత్నం, టాస్క్‌ఫోర్స్ ఎస్సై రామారావు, సిబ్బంది వెంకన్న, రామకష్ణ, దిలీప్, గైడ్ చేసిన మహబూబాబాద్ డీఎస్పీ సదయ్యను ఎస్పీ అభినందించారు.
సీరోల్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ తనిఖీ
సీరోల్ పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ కోటిరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. తొలుత గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం లాకప్, ఇతర గదులను, ఫైళ్లను పరిశీలించారు. తదనం తరం పోలీసు సిబ్బందితో ఎస్పీ మాట్లాడారు. పోలీసులు పెండింగ్ కేసులపై దష్టి సారించా లని ఎస్పీ సూచించారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని సూచించారు. ఆయన వెంట తొర్రూరు డీఎస్పీ వెంకటరమణ, మరిపెడ సీఐ సాగర్, సీరోల్ ఎస్సై సంతోష్ ఉన్నారు.