Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-ధర్మసాగర్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు వినియోగించుకోవాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. మండలంలోని నారాయణగిరి గ్రామాలో ఓడీసీఎంఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రానిన మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. నియోజకవర్గంలో తొలిసారిగా మొదటి ఓడీసీఎంఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాని గ్రామంలో ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు, ఉచిత విద్యుత్, తదితర అనేక పథకాలు అమలు చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీలు నిమ్మ కవితరెడ్డి, కేసిరెడ్డి సమ్మిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు, మల్లక్‌పల్లి సర్పంచ్ మునిగాల రాజు, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యురాలు జుబేదా లాల్ మహమ్మద్, కర్ర సోమిరెడ్డి, వరంగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కాలేరు కరంచంద్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ యాద కుమార్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ సోంపెల్లి కరుణాకర్, వైస్ ఎంపీపీ బండారు రవీందర్, పెద్ది శ్రీనివాస్, మండల కోఆప్షన్ సుక్రు, బొడ్డు సోమయ్య, ఏఓ పద్మ, తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట : మడికొండలో వీ సిటీ వెంచర్లో కాజీపేట దర్గా పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీసీబీ చైర్మెన్ మార్నేని రవీందర్రావు ప్రారంభించి మాట్లాడారు. రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ అధ్యక్షుడు ఊకంటి వనంరెడ్డి, కార్పొరేటర్లు ఆవాల రాధిక నరోత్తంరెడ్డి, మునిగాల సరోజన కరుణాకర్, జిల్లా సహకార అధికారి నాగేశ్వర్రావు, డీఎస్ఓ కష్ణవేణి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ రవీంద్ర, వెంకటేశ్వర్లు, వసంత, లక్ష్మి, త్రినాథ్‌రెడ్డి, కాజీపేట దర్గా వైస్ చైర్మెన్ మాదాసు బాబు, డైరెక్టర్లు దువ్వ శ్రీకాంత్, సుల్తానా వెంకన్న, తంపుల రమ, బేతి భూపాల్‌రెడ్డి, బీరెడ్డి జ్యోతి, మర్కాల దామోదర్‌రెడ్డి, పుల్యాల సంపత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎల్కతుర్తి : మండలంలోని తిమ్మాపూర్, కేశవాపూర్, దండేపల్లి, సూరారం, కోతుల నడుమ, చింతలపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో సింగిల్ విండో చైర్మెన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, ఎంపీపీ మేకల స్వప్న ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నగేష్, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గొడిశాల సమ్మయ్య గౌడ్, సింగిల్ విండో వైస్ చైర్మెన్ మునిగడప శేషగిరి, తదితరులు పాల్గొన్నారు.