Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జూనియర్ సివిల్ జడ్జి రాజ్‌కుమార్
నవతెలంగాణ-తొర్రూరు
విద్యార్థులు ప్రాథమిక స్థాయి నుంచే చట్టాలపై అవగాహన పెంచుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవా సంస్థ చైర్మెన్ రాజ్‌కుమార్ కోరారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా స్థానిక సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాలలో మంగళవారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, సమాజంలో మహిళలపై అత్తింటి వేదింపులు, యువతులపై ఈవ్ టీజింగ్, తదితరాలపై న్యాయ పోరాటం చేయొచ్చని చెప్పారు. విద్యార్థులు ఉచిత న్యాయ సలహాలు పొందవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఏజీపీ కల్వకొలను ప్రవీణ్ రాజు, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వల్లపు మహేష్, న్యాయవాదులు వెంకన్న, లాలు, శ్రీను, అశోక్, ప్రిన్సిపాల్ జయశ్రీ, తదితరులు పాల్గొన్నారు.