Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి
విద్యుత్ భవన్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-హన్మకొండ
నగరంలోని లింగాల వెంకట్రామయ్యనగర్ కాలనీలోని గుడిసెవాసు లకు వ్యక్తిగత విద్యుత్ మీటర్లు ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో హనుమకొండలోని విద్యుత్ భవన్ ఎదుట గుడిసెవాసులు మంగళవారం ధర్నా నిర్వహించగా రవి మాట్లాడారు. కాలనీ ఏర్పడి 15 ఏండ్లు గడుస్తున్నా అధికారులు విద్యుత్ మీటర్లు ఇవ్వలేదన్నారు. అలాగే కార్పొరేషన్ అధికారులు ఇంటి నెంబర్లు ఇవ్వకుండా ఇబ్బందుల పాల్జేస్తున్నారని విమర్శించారు. విద్యుత్ సదుపాయం లేకపోవడంతో గుడిసెవాసులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి విద్యుత్ మీటర్లు, హౌజ్ నెంబర్లు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎన్పీడీసీఎల్ సీఎండీకి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు షేక్ బాషుమియా, బుస్స రవిందర్, నాయకులు తోట భిక్షపతి, దండు లక్షణ్, ఎలేందర్, శ్రీవిద్య, గుండె బద్రి, గణేష్, కపూర్ పాల్గొన్నారు.