Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రూ.59వేల నగదు, సెల్ఫోన్లు స్వాధీనం
నిందితుల్లో ఉపాధ్యాయులు, వైద్యుడు
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
మండల కేంద్రంలోని పేకాట స్థావరంపై మంగళవారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేపట్టారు. ఈ సందర్భంగా రహస్యంగా పేకాడుతున్న ఏడుగురిని నుంచి రూ.లు 59,330లు, ఆరు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాస్‌జీ, సంతోష్‌లు తెలిపారు. వారి వివరాల ప్రకారం... మండల కేంద్రంలో రహస్య స్ధావరంలో పేకాడుతున్న తాళ్లూరి వెంకటేశ్వర్లు, తాళ్లూరి నర్సింహాస్వామి, కంది సుబ్బారెడ్డి, బానోత్ బిక్షపతి, బండి భాస్కర్‌రెడ్డి, రాపోలు యాకయ్య, బాల్నే ఉపేందర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అరెస్టయిన వారిలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వైద్యుడు, ఇద్దరు వ్యాపారులు, ఒక రాజకీయనేత ఉన్నారు. వారిని అరెస్టు చేసి రిమాం డ్కు తరలించినట్లు స్థానిక ఎస్సై నాగరాజు తెలిపారు.
2.20 క్వింటాళ్ల బెల్లం సీజ్,
నలుగురిపై కేసు
మండల కేంద్రంలో నల్లబెల్లం విక్రయిస్తున్న దుకాణాలపై దాడులు నిర్వ హించి 2.20 క్వింటాళ్ల నల్లబెల్లాన్ని పట్టు కున్నట్లు టాస్క్‌ఫోర్స్ సీఐలు శ్రీనివాస్‌జీ, సం తోష్ తెలిపారు. నల్లబెల్లంను సప్లై చేస్తూ, విక్ర యిస్తున్న తాళ్లూరి నర్సింహాస్వామి, దొడ్డ నాగేశ్వర్రావు, నంగునూరి క్రిష్ణమూర్తి, తొడిశెట్టి మోహన్‌రావులపై కేసు నమోదు చేసి బెల్లంను స్వాధీనం చేసుకున్నట్లు వారు చెప్పారు. వీరిపౖౖె కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.