Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నారావుపేట :
ఇటీవల మృతిచెందిన పాపయ్యపేట మాజీ సర్పంచ్, సొసైటీ డైరెక్టర్ కంచ రామచంద్రు కుటుంబానికి ఆయన మిత్రులు చేయూతనందించారు. మృతుడితో పాటు పదో తరగతి చదివిన(1987-88) స్నేహితులు బాధిత కుటుంబానికి బుధవారం రూ.లు 30వేలు ఆర్థికసాయం, 2క్వింటాళ్ల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో కెే మల్లయ్య వీరునాయక్, మంగ శ్రీనివాస్, శ్రీను బాబు, సారంగపాణి, కొమురయ్య, వెంకటేశ్వరు, సాయిలు, భాస్కర్, సోమనర్సయ్య తదితరులు పాల్గొన్నారు.