Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-నల్లబెల్లి
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్థానిక క్రాస్‌రోడ్డు జాతీయ రహదారిపై కాంగ్రెస్ మండలాధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి కోతలు మొదలుపెట్టి 15రోజులు గడిచినా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేకపోవడం ప్రభుత్శ చేతగానీ తనానికి నిదర్శనమన్నారు. లక్షల కోట్లతో ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాల మాగాణికి నీరు అందిస్తామని చెప్పి తీరా పండించిన పంటను కోనే స్థితిలో ప్రభుత్వం లేకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలోని మంత్రులు వారి వ్యాఖ్యలతో వరి ధాన్యం పండించే రైతులను అయోమయ పరిస్థితిలోకి నెట్టారని విమర్శించారు. యాసంగి వరి సాగు చేసే ప్రాంతాలలో ఏ పంట అనుకూలంగా ఉంటుందో వ్యవసాయ శాఖ అధికారులతో సర్వే నిర్వహించి పండిన పంటకు మద్దతు ధర ముందుగానే ప్రకటించాలని డిమాండ్ చేశారు. వెంటనే ధాన్యంక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లేకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాలోత్ చరణ్ సింగ్, వైనాల అశోక్, బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్ల శివారెడ్డి, సంపత్ రెడ్డి, అంజలి మోహన్ సురేష్, చిలుపురి జ్యోతి, విమల తదితరులు పాల్గొన్నారు.