Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పర్వతగిరి
ఇస్లావత్ తండా పంచాయతీ కార్యాలయంలో 'సఫల్ భారత్ ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఈ నెల 13న ఉదయం 10:30 గంటలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చనున్నట్టు సర్పంచ్ ఇస్లావత్ రమేశ్ తెలి పారు. బుధవారం ఆయన గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో న్యూరో, కార్డియాలజీ, రుమటాలజీ, ఆప్తమాలజీ, షుగర్, బీపీ తదితర వైద్యనిపుణులు ఉచితంగా చికిత్స అంద జేయనున్నట్టు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సమా వేశంలో ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పారుపెల్లి శారదా, శ్యామ్ సుందర్, కిషోర్, కో-ఆర్డినేటర్, గడ్డం కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.