Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దామెర
మంగళవారం నిర్వహించిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు చట్టబద్దంగా నిర్వహించలేదని, తిరిగి ఈ ఎన్నికలను చట్టబద్ధంగా నిర్వహించాలని ఈ ఎన్నికల్లో నామినేషన్ తిరస్కరించిన వారూ డిమాండ్ చేశారు. బుధవారం వారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో మాట్లాడారు. సహకార సంఘం డైరెక్టర్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసే సమయంలో ఎన్నికల అధికారి మాదిసు సు ల్తాన్ కొందరికీ అనూకూలంగా వ్యవ హరించాడని ఆరోపించారు. అధికార దుర్వి నియోగం చేసి అర్హులైన సభ్యుల నామినేషన్ పత్రాలను తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఆయనపై కో-ఆపరేటివ్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆ అధికారిపై చర్యలు తీసుకుని తిరిగి న్యాయబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో సారా రాజు, ఆలేటి లింగమూర్తి, తుమ్మ కుమారస్వామి, మహేందర్, ప్రసాద్, సుధాకర్ పాల్గొన్నారు.