Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కాజీపేట
స్థానిక విజేత పాఠశాలలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి మొదటి ఫెన్సింగ్పోటీలను బుధవారం బీఎస్పీ జిల్లా కో-ఆర్డినేటర్ గంధం శివ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫెన్సింగ్ క్రీడకు ఆదరణ కలిగేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం పెన్సింగ్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి దుబ్బ రాముడు మాట్లాడుతూ.. ఈ పోటీలలో రాణించిన వారిని 12-14వరకు కరీంనగర్లో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. ఫెన్సింగ్‌లో జిల్లా నుంచి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దుతానన్నారు. ఈ కార్యక్రమంలో హరికిషన్, డాక్టర్ పీవీ మల్లికార్జున్, గొట్టిముక్కుల రాజారెడ్డి, శ్రీను, రాజు, సురేందర్, పాఠశాల డైరెక్టర్ ప్రదీప్ కుమార్, ఉపాధ్యాయురాలు కల్పన తదితరులు పాల్గొన్నారు.