Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వాజేడు
సమాజంలో బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరిదని సీడీపీఓ ముత్తమ్మ అన్నారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగము ఆధ్వర్యంలో స్థానిక జెడ్పీ పాఠశాలలో బుధవారం విద్యార్థులకు 'బాలల హక్కుల పరిరక్షణ' పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాటా ్లడారు. బాలికలు రక్తహీనత నివారణ కోసం పోష కాహారం తీసుకోవాలన్నారు. అనంతరం ఐసీడీఎస్ పీఓ హరికష్ణ మాట్లాడుతూ.. బాలల ప్రాథమిక హక్కు లను గురించి వివరించారు. అక్రమ దత్తత నేరమని, ఎవరైనా పిల్లలు కావాలనుకుంటే తమను సంప్ర దించినట్లైతే చట్టబద్ధంగా పిల్లలను దత్తతను ఇస్తామని పేర్కొన్నారు. బాల్య వివాహాలు, బాలకార్మికులు, బాలలపై లైంగిక వేధింపులు తదితర విషయాలు చోటు చేసుకుంటే వెంటనే చైల్‌లైన్ 1098కి సమాచారం అందించాలన్నారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచు తామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జి వంశీ, ఐసీడీఎస్ సూపర్వైజర్లు జగదాంబ, పుష్పవతి, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
నవతెలంగాణ-కాజీపేట
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని చైల్డ్‌లైన్ జిల్లా మెంబర్ బెజ్జంకి ప్రభాకర్ అన్నారు. బుధవారం స్థానిక ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో చైల్డ్‌లైన్ 1098 ఆధ్వర్యంలో 'బాల్యవివాహాలు. అనర్థాలు, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన' అనే అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల్య వివాహాలను ప్రొత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలలతో పనిచేయించడం బాలకార్మిక నిషేధ చట్టం 1986ప్రకారం నేరమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు జరిపించకుండా, వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని కోరారు. ఎవరైనా బాల్య వివాహాలు నిర్వహింయినట్టయితే చైల్డ్‌హెల్ప్ లైన్-1098 సమాచారం ఇవ్వాలన్నారు. అనంతరం బాలల సేవలు, బాలల రక్షణకు సంబందించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజేంద్రం, ఉపాధ్యాయ సిబ్బంది అశోక్, రాణి, ప్రవీణ్, జ్యోతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించాలి
నవతెలంగాణ- ములుగు
బాల్యవివాహాలు, బాలలతో పని చేయించడం, బాలల అక్రమ రవాణా తదితర ఘటనలు చోటు చేసుకుంటే వెంటనే ఆ వివరాలను చైల్డ్‌లైన్ 1098కి సమాచారం అందించాలని సీడీపీఓ లక్ష్మీ అన్నారు. బుధవారం కాసీందేవిపేట జెడ్పీ పాఠశాలలో సర్పంచ్ ఎంపీ ఆహమ్మద్ పాషా అధ్యక్షతన బాలల హక్కుల వారోత్సవాలను సందర్భంగా ఉపన్యాస పోటీలు నిర్వహించారు. అలాగే బాలల హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్, జెడ్పీహెచ్ఎస్ ప్రిన్సిపాల్ సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.