Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
రైతుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని 45వ డివిజన్ కార్పొరేటర్ ఇండ్ల నాగేశ్వర్ రావు, పీఏసీఎస్ దర్గా సొసైటీ చైర్మన్ ఊకంటి వనం రెడ్డి అన్నారు. కడిపికొండలో పీఏసీఎస్ దర్గా సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం వారు ప్రారంభించి మాట్లాడారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ధాన్యం కొనుగోలు చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ మాదాసు బాబు, డైరెక్టర్లు సంపత్ రెడ్డి, రజినికర్ రెడ్డి, కడిపికొండ, భట్టుపల్లి, కొత్తపల్లి, తరాలపల్లి, అయోధ్యపురం, కుమ్మరిగూడెం గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.