Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని బుచ్చంపేటలోని గ్రామకంఠం భూమిలో బహత్ పల్లె ప్రకతి వనం పెట్టొద్దని, అట్టి భూమి గ్రామానికి ఉపయోగపడే ప్రభుత్వ భవనాలకు మాత్రమే వినియోగించాలని ఆ గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది ఫారెస్ట్ రేంజ్ కార్యాలయం చేరుకుని రేంజ్ అధికారి షకిల్ పాషాకు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో 1970లొనే ముత్యాలమ్మ గుడి, నాగులమ్మ గుడి నిర్మించుకోగా మిగతా భూమిని గ్రామ కంఠంగా ఉంచి గ్రామానికి అవసరమయ్యే ప్రభుత్వ భవనాలు నిర్మించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. అట్టి స్థలంలో బస్ స్టాప్, రామాలయంతో పాటు గ్రామంలో పెరిగిన జనాభా ప్రకారం కమ్యూనిటీ భవనం నిర్మించాలని తీర్మాణించినట్లు తెలిపారు. బహత్ పల్లె పకతి వనం నిర్మించడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలను విరమించుకోని గ్రామంలోని మరో స్థలంలో నిర్మించాలని కోరారు.